NGT : మూసీ ప్రాజెక్టుపై మొండిగా ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ అనుమతుల జారీ, ప్రాజెక్టు అమలుకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తన వాదనలను, సంబంధిత వివరాలను తమకు వెంటనే అందజేయాలని చెన్నై ఎన్జీటీ బెంచ్ నోటీసులు జారీ చేసింది.
సర్కార్ జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఇంజినీర్లు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) సౌత్ బెంచ్‌ను ఆశ్రయించారు. మూసీ పరివాహక ప్రాంతం మొత్తం 55 కిలోమీటర్లు ఉంటే ప్రభుత్వం కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే పరిశీలించిందని వారు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఇదే రీజియన్‌లో మృగవాణి నేషనల్ పార్క్ కూడా ఉందనే విషయాన్ని వారు వెల్లడించారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల పక్కన భారీ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటైర్డ్ ఇంజినీర్లు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించి, పర్యావరణ అనుమతుల జారీ, ప్రాజెక్టు అమలుకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తన వాదనలను, సంబంధిత వివరాలను తమకు వెంటనే అందజేయాలని చెన్నై ఎన్జీటీ బెంచ్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసింది.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ
మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ, చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ బెంచ్‌ను ఆశ్రయించిన రిటైర్డ్ ఇంజినీర్లు
మూసీ పరివాహక ప్రాంతం మొత్తం 55 కిలోమీటర్లు… https://t.co/1ibaav30j8 pic.twitter.com/MpdHs0GaOv
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2026