నెక్కొండ, నవంబర్ 17: బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ గ్యారెంటీ అని, వారెంటీ లేని కాం గ్రెస్ పార్టీకి గ్యారెంటీ ఎవరూ లేరని నర్సం పేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శిం చారు. సూరిపల్లి, పత్తిపాక, సాయిరెడ్డిపల్లె, మహబూబ్నాయక్తండా, పిట్టకాయలబోడుతండా, రెడ్లవాడ, గొట్లకొండ, అజ్మీరా మంగ్యానాయక్తండా, రెడ్యానాయక్‌తండా, అలంకానిపేట, తోపనపల్లి, బొల్లికొండ, వెంకటాపురం, అప్పల్‌రావుపేటలో సుదర్శన్‌రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారని కొనియాడారు. సరైన నాయకుడు, అవగాహన లేని మోసపూరిత పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. గ్యారెంటీ లేని పార్టీ ఇస్తున్న వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను నిస్వార్థంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా అమలు కాని సంక్షేమ పథకాలు నర్సంపేటలో అమలవుతున్నట్లు వివరించారు. ప్రతి గ్రామంలో సీసీరోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించడంతోపాటు ప్రతి గ్రామానికి, మండలకేంద్రానికి, తండాలకు లింక్ రోడ్లు నిర్మించామని వివరించారు. నర్సంపేటలో జిల్లాస్థాయి దవాఖాన నిర్మాణంతోపాటు మెడికల్ కాలేజీని మంజూరు చేయించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నర్సంపేట నియోజకవర్గంలో ఎకరాకు రూ. 10 వేల చొప్పున రైతులకు పంట నష్టపరిహారం ఇప్పించామన్నారు. అభివృద్ధిలో నియోజకవర్గం పరుగులు పెడుతున్నదని వివరించారు. పనులు కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పెద్ది కోరారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తూ నర్సంపేటను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపానని, ప్రజలంతా ఒక్కటై కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నెక్కొండ మండలంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి పల్లె లు, తండాల్లో అడుగడుగునా అపూర్వ స్వాగతం ల భించింది. బతుకమ్మలు, బోనాలతో మహిళలు ఎదురొచ్చి పెద్దికి వీరతిలకం దిద్దారు. గ్రామాలు, తండాల్లో డప్పుచప్పుళ్ల మధ్య పటాకులు కాలుస్తూ బీఆర్ఎస్కు జై కొట్టారు. ప్రచార ర్యాలీకి ప్రజలు భారీగా తరలొచ్చారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా గులాబీ జెండాలే దర్శనమిచ్చాయి. అభివృద్ధికే మా మద్దతంటూ గ్రామా లు, తండాల్లో ప్రజలు ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నెక్కొండ, రెడ్లవాడ, సూరిపల్లి సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్‌రావు, దామోదర్‌రెడ్డి, పీపీ అబ్దుల్ నబీ, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కొమ్ము రమేశ్‌యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి తాటిపెల్లి శివకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూరం రాజిరెడ్డి, మండల నాయకులు గుంటుక సోమయ్య, గాదె భద్రయ్య, బొల్లెబోయిన వీరస్వామి, సుధీర్‌రెడ్డి, మాతంగిరాజు, కొణిజేటి భిక్షపతి, సర్పంచ్‌లు గీతాభాస్కర్, రావుల శ్రీలతాప్రసాద్, మాలోత్ పూర్ణ, అరవింద్, తులసి వెంకన్న, సరోజా వెంకన్న, ఫకీర్మియా, మాదాసు అనంతలక్షీ రవి, గాడుదుల కుమార్, ఎంపీటీసీలు కర్పూరపు శ్రీనివాస్, బండారి వినయకుమారి శ్రీనివాసరావు, అపర్ణ రవీందర్రాపు పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్/చెన్నారావుపేట: నియోజకవర్గ ప్రజలు మరోసారి తనను ఆశీర్వదిస్తే నర్సంపేట డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన సింగన శ్రీనుతోపాటు మరికొంత మంది శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, పార్టీ గ్రామ అధ్యక్షుడు జర్పుల వీరన్న, ప్రధాన కార్యదర్శి మామిడి ఐలయ్య, వార్డు సభ్యులు ఉప్పుల రాజు, వంగ పురుషోత్తం పాల్గొన్నారు. అదేవిధంగా గురిజాలకు చెందిన ముదిరాజ్ సంఘం కార్యదర్శి కొక్కు రాజమౌళితోపాటు మరో ఐదుగురు బీఆర్ఎస్లో చేరగా, సుదర్శన్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ మండల కన్వీనర్ అన్న కోమల-రాజమల్లు, ఉప సర్పంచ్ మంచిక హరీశ్, పార్టీ గ్రామ అధ్యక్షుడు చిన్నపెల్లి నర్సింగం, ఉపాధ్యక్షుడు మంచిక దేవేందర్, సంగెం శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేట మండలం గొల్లపల్లెకు చెందిన 20 కాంగ్రెస్ కుటుంబాలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. కార్యక్రమంలో పార్టీ యూత్ మండల ఇన్చార్జి కృష్ణచైతన్యరెడ్డి, సర్పంచ్ రమేశ్, భరత్, సురేశ్ పాల్గొన్నారు.