సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకటనలు వెలువడిన నాటి నుంచి ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలు సంబురాలు జరుపుకొంటున్నారు. మ్యానిఫెస్టోను స్వాగతిస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. అర్హులైన మహిళలకు గౌరవ భృతి, కేసీఆర్ బీమా, పేదలకు ఇండ్ల స్థలాలు, అసైన్డ్ భూములకు పట్టాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ అమలుపై అధ్యయన కమిటీతో పాటు పలు హామీలు జన ఆమోదం పొందుతున్నాయి. ప్రతి కుటుంబానికి మూడు నుంచి నాలుగు పథకాలతో లబ్ధి చేకూరేలా ప్రణాళికలు తయారు చేశారని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఏం కావాలో తెలుసుకొని బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తయారు చేశారని చర్చించుకుంటున్నారు.
రేగొండ, అక్టోబర్ 17 : మాది రేగొండ మండలం చెంచుపల్లె. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ప్రతిరోజూ కూలికి పోయి బతుకుతున్న. ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యంతోనే తింటున్నం. పేదలందరికీ సన్నబియ్యం ఇస్తనని సీఎం కేసీఆర్ చెప్పడం సంతోషమనిపించింది. ఇంతకుముందు కూడా కొన్ని నెలలు సన్నబియ్యం ఇచ్చిండు. అప్పుడు తిన్నం. ఇప్పుడు మళ్లీ ఇత్తనని చెప్తండు. ఆయన చేసేదే చెప్తడు. సన్నబియ్యం కొనాలంటే కిలోకు రూ.60 నుంచి రూ.70 వరకు ఉన్నాయి. గన్ని పైసలు పెట్టి కొనుక్కునే పరిస్థితి లేదు. గతంల ఏ సర్కారు ఇలాంటి పథకం తేలేదు. ఆయన గెలిస్తేనే మా లాంటి నిరుపేద కుటుంబాలు సన్న బియ్యం తినే రోజులు వస్తాయి.
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా, ఏ ఇద్దరిని పలకరించినా బీఆర్ఎస్ హామీలపై చర్చించుకుంటున్నారు. ప్రకటనలు వెలువడిన నాటి నుంచి సంబురాలు జరుపుకుంటున్నారు. సీఎం కేసీఆర్ చెప్పిండంటే కచ్చితంగా చేసి తీరుతాడని జనం నమ్ముతున్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఏం కావాలో తెలుసుకొని బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారు చేశారని చర్చించుకుంటున్నారు.
ములుగు రూరల్, అక్టోబర్ 17 : సీఎం కేసీఆర్ సారు ఆసరా పింఛన్లు పెంచుతామనడం ఆనందంగా ఉంది. నా భర్త సంగయ్య పాణం మంచిగ లేక చనిపోయి ఇప్పటికి 20ఏళ్లు అయితున్నది. అప్పటి ప్రభుత్వం నెలకు రూ.200 పింఛన్ ఇచ్చేది. అవి ఎటూ సరిపోక కూలి పనులకు పోయి పిల్లలను సాదుకున్న. ముగ్గురు బిడ్డలు అయితే నా భర్త ఉన్నప్పుడు ఇద్దరి పెండ్లిళ్లు అయినయ్. చిన్న బిడ్డ పెండ్లి అయి 16ఏళ్లు అయితాంది. కొడుకు డిగ్రీ చదివిండు. నాతోనే ఉంటడు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు పింఛన్లు రెండు సార్లు పెంచిండు. ఆ పైసలు నాకు పెద్ద దిక్కు అయినయ్. వయసు మీద పడడంతో పని చేయడం సాతన అయితలేదు. మోకాళ్ల నొప్పులు వస్తున్నాయ్. ప్రభుత్వం ఇచ్చిన పైసలతోటి పాణం మంచిగ లేనప్పుడు దవాఖానలో చూపించుకొని మందులు తీసుకుంటున్న. ఇంట్లకు కూడా అక్కరకు వస్తున్నాయ్. మళ్ల గెలిస్తే పింఛన్ రూ.5వేలకు పెంచుతానని కేసీఆర్ సారు చెప్పడం గొప్ప విషయం. గెలిచిన తర్వాత రూ.3016 ఇచ్చి సంవత్సరానికి రూ.500 చొప్పన పెంచుతూ రూ.5016 వరకు చేస్తా అంటున్నడు. కచ్చితంగా చేసి తీరుతడు. నెల నెలా సన్నబియ్యం కూడా ఇస్తానని అన్నడు. నాకు 35కిలోల బియ్యం రేషన్ షాపులో వస్తాయ్. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తే నాలుగు మెతుకులు రంది లేకుండా తింట.
మంగపేట, అక్టోబర్ 17 : సీఎం కేసీఆర్ అంటే రాష్ట్ర ప్రజలకు ఓనమ్మకం. ఆయన మాట ఇస్తే తప్పేవ్యక్తి కాదు. పెరిగిన వంట గ్యాస్ ధరలతో సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నరు. ప్రతి నెలా రూ.974 పెట్టి గ్యాస్ కొనాలంటే భారంగా ఉంది. పేద మహిళల వంటింటి కష్టాలు అర్థం చేసుకొని రూ.400ల కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం ఆనందంగా ఉంది. లక్షలాది కుటుంబాలకు ఎంతో మేలు జరుగనుంది. గత ఎన్నికల్లో హామీ ఇవ్వకున్న అనేక పథకాలు తీసుకొచ్చి అమలు చేసిండు. దీంతో రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం కుదిరింది. ఒక వర్గం అని కాకుండా ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పాలన అందించి రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చి రుజువు చేసుకున్నాడు. మూడో సారి కూడా ఆయనే సీఎం కావాలి.
మహదేవపూర్, అక్టోబర్ 17 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఉంది. తెల్ల రేషన్ కార్డుదారులకు కేసీఆర్ బీమా పథకం చాలా బాగుంది. రైతు బీమా మాదిరి నిరుపేదల కోసం ప్రత్యేకంగా రూపొందించడం హర్షణీయం. గతంలో ఇంత మంచి ఆలోచన ఏ పార్టీ చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాలను రూపొందించింది. ప్రజలు బీఆర్ఎస్ పాలననే కోరుతున్నారు. కచ్చితంగా బీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి రావడం ఖాయం.
ఏటూరునాగారం, అక్టోబర్ 17 : అగ్రవర్ణాల పేదల కోసం గురుకులాలను ఏర్పాటు చేయాలనే సరికొత్త ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యం అవుతుంది. గతంలో ఏ ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదల గురించి ఆలోచన చేయలేదు. ఎక్కడైనా ఓసీలకు ఒకటి, రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. దీంతో పోటీ ఏర్పడి అనేక మంది పిల్లలు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉంది. చాలా మంది చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రవర్ణాలకు గురుకులాలు ఏర్పాటు చేయడం అనే నిర్ణయం అభినందనీయం. ఇక వారు కూడా చదువులో రాణించే అవకాశం ఉంది. ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు ఈ నిర్ణయంతో ఊరట. అగ్రవర్ణాల నిరుపేదల విద్యార్థుల చదువులకు జీవం పోసినట్లే. ఇది ఇక్కడ తొలి ప్రయోగంగా నిలుస్తుంది. రాష్ట్రంలో అనేక ఓసీ కులాల్లో నిరుపేదలు ఉన్నారు. వీరిని బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించడం, వారి కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఇలాంటి విజన్ ఉన్న నాయకులకు అన్ని వర్గాల మద్దతు ఎన్నడూ ఉంటుంది.
గోవిందరావుపేట, అక్టోబర్17 : పేదలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళలపై ఎంతో గౌరవం ఉంది. మహిళా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. అన్ని వర్గాలకు చేరువయ్యేలా మ్యానిఫెస్టో ప్రకటించడం అభినందనీయం. రూ.400లకే గ్యాస్ ప్రకటించడంతో మహిళలు సంబురాలు జరుపుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఓటేస్తాం.
మహాముత్తారం, అక్టోబర్17 : అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ చేర్చడం గొప్ప నిర్ణయం. అసైన్డ్ భూమిలో ఇల్లు కట్టుకుందామంటే రెవెన్యూ వాళ్లు ఇబ్బందులకు గురి చేసేది. బ్యాంకు వాళ్లు లోన్ ఇస్తలేరు. దీంతో ఏం చేయాలో తోచకపోయేది. మా చుట్టు పక్కల ఊర్లల్లో దాదాపు చాలా కుటుంబాలకు అసైన్డ్ భూమే ఉంది. కేవలం దున్నుకోని బతికే వాళ్లం. సీఎం కేసీఆర్ అసైన్డ్ భూమిపై ఉన్న ఆంక్షలు ఎత్తి వేస్తాను అని పేర్కొనడం ఆనందంగా ఉంది. నేను, మా కుటుంబం బీఆర్ఎస్ వైపే ఉంటాము.
ములుగు, అక్టోబర్17 (నమస్తేతెలంగాణ) : మా నాన్న గంగిశెట్టి సత్యనారాయణ స్థాపించిన సిమెంట్ అండ్ ఐరన్ హార్డ్‌వేర్‌లో 25 ఏళ్లుగా ములుగులో వ్యాపారం చేస్తున్నా. తెలంగాణ కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నా. రాష్ట్ర కళ సాకారం అయిన తర్వాత ములుగు అభివృద్ధి చెందాలని ఆకాంక్ష ఉండేది. దానికనుగుణంగానే సీఎం కేసీఆర్ ములుగును జిల్లా చేశారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు వచ్చాయి. ప్రైవేట్ రంగం వ్యక్తులు కూడా అభివృద్ధి చెందారు. నాలుగేళ్లలో నిర్మాణ రంగం చాలా అభివృద్ధి చెందింది. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సంబంధించింది కూడా బాగుంది. చాలా మంది పిల్లలు సిటీల్లో ఉంటున్నారు. పిల్లలు ఇక్కడ లేకపోవడంతో ఊర్లలో వృద్ధాప్యంలో ఉన్న వారికి కేసీఆర్ ఆసరా పింఛన్ ఇస్తున్నారు. వారికి వైద్య ఖర్చులకు అవసరం పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో బాగుంది. సమాజంలో అభివృద్ధితో పాటు సంక్షేమం గొప్ప విషయం. చుట్టు పక్కల రాష్ర్టాల్లో చూసినట్లయితే అభివృద్ధి ఉంటే సంక్షేమం ఉండటం లేదు. మన రాష్ట్రంలో రెండు జోగు గుర్రాల్లా పరిగెడుతున్నాయి. ఇదే ఒరవడి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అగ్రవర్ణాలకు సంబంధించి జిల్లాకు ఒక గురుకులాన్ని ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా దగ్గర పనిచేసే అబ్బాయి బీసీ యాదవ వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ల చెల్లె పెండ్లి చేస్తే రూ.లక్షా 116లు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు పెండ్లికి సాయం చేయలేని పరిస్థితి ఉంది. అలాంటి కల్యాణలక్ష్మి సాయం అందడం వల్ల నా దగ్గర పనిచేసే అబ్బాయి చాలా ఆనందంగా ఉన్నాడు. ఏ పథకమైన లబ్దిదారుడికి చేరిన తర్వాత ఆ సంతోషం విలువ వేరే ఉంటుంది.
గణపురం, అక్టోబర్ 17 : పదేండ్లలో రైతుల సంక్షేమానికి కేసీఆర్ సార్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు అమలు చేసిండు. రుణమాఫీ చేసి అప్పుల బాధ తీర్చిండు. ఇప్పటికే ఎకరాకు రూ.10వేలు ఇస్తూ పెట్టుబడికి సాయమందిస్తున్నడు. దళారులతో ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటకు గిట్టుబాట ధర కల్పిస్తూ ఆదుకుంటున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి, సాగు, తాగు నీరు అందించిండు. కాంగ్రెస్ హయాంలో పెట్టుబడి కోసం సేటు దగ్గరికి పోయి అప్పు తెచ్చుకొని పంటలు పండించుకునేటోళ్లం. కానీ, సీఎం సారు రైతు బంధు ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ అప్పుల తిప్పలు లేకుండా చేసిండు. మళ్లిప్పుడు రైతుబంధును రూ.16 వేలకు పెంచుతానంటున్నడు. సంతోషంగా ఉంది. ఆ డబ్బులు పెట్టుబడికి ఎంతో ఉపయోగపడుతాయి.
కృష్ణకాలనీ, అక్టోబర్ 17 : నాపేరు లావుడ్యా రజిత. మాది భూపాలపల్లి మున్సిపల్ పరిధి 11వ వార్డు పెద్దకుంటపల్లి తండా. నిరుపేద కుటుంబం. నా భర్త 9ఏండ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిండు. అప్పుడు పిల్లలు చిన్నోళ్లు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. పిల్లలను సాదడం చానా కట్టమైంది. మా కౌన్సిలర్ రజితా జుమ్ములాల్ సాయంతో ఒంటరి మహిళ పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్న. అప్పటి నుంచి పింఛన్ వస్తున్నది. ఇంట్లో బియ్యం, సామగ్రి కొనుక్కొని తినుకుంటూ.. పిల్లలను చదివించుకుంటున్నా. తొమ్మిదేండ్ల నుంచి ఆసరా పింఛన్ ఎంతో అక్కరకొస్తున్నది. రూ. 2వేల పింఛన్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కేసీఆర్ సార్ దయతో తీసుకుంటున్నా. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో రూ.5వేల పింఛన్ ఇస్తానని చెప్పిండు. మళ్ల సారునే గెలిపించుకుంటే రూ. 5వేల పింఛన్ తప్పకుండా ఇత్తడు. ఆయన మాట ఇస్తే తప్పడు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులుండవు. కాంగ్రెస్ హయాంలో కేవలం రూ.500 మాత్రమే ఇచ్చేది. అదికూడా అందరికీ ఇచ్చేది కాదు.వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులను పట్టింకునేదికాదు. సీఎం సారు వచ్చినంక అందరినీ సమానంగా సూత్తున్నడు.