మహాదేవపూర్, జూన్ 12 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో 2024 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ శిక్షణాధికారల బృందం గురువారం పర్యటించారు. ముందుగా కాళేశ్వర- ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెనను పరిశీలించి, కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నపెల్లి లక్ష్మీ పంప్ హౌస్‌ను సందర్శించారు. పంప్ హౌస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని సందర్శించి ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2024 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ శిక్షణా అధికారుల బృందం సౌరభ్ శర్మ, సలోని చోబ్రా, హర్ష చౌదరి, కెరోలిన్ చింగ్తయానమావి, కోయ్యాడ ప్రణయ్ కుమార్‌తో పాటు మహదేవపూర్ డిప్యూటీ తాసిల్దార్ కృష్ణ, లైసన్ ఆఫీసర్ అబ్బాస్, కోర్స్ డైరెక్టర్ శ్రీనివాస్, ఇరిగేషన్ శాఖ డీఈఈలు సత్యబాబు, సురేష్, ఏఈఈ ,ఏఈలు, తదితరులు ఉన్నారు.