CITU Strike | వరంగల్ : మున్సిపల్ కార్మికులందరికీ వెయ్యి రూపాయల వేతనం పెంచుతూ 2023 మే 1వ తేదీన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 40ని వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఉప్పలయ్య డిమాండ్ చేశారు. ఇవాళ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలలో పనిచేసే మల్టీపర్పస్ కార్మికులందరికీ వెయ్యి రూపాయల వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. వరంగల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులకు ఏప్రిల్ నెల వేతనాలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతీ నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని అన్నారు. అనంతరం కమిషనర్ అశ్విని తానాజీ వాకడేను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సింగారపు బాబు, జన్ను ప్రకాష్, సుద్దాల కుమార్, అర్జున్, శ్రీనివాస్‌తోపాటు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు