హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 11: గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలలో, పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని సిఐటియు రాష్ర్ట కార్యదర్శి కాసు మాధవి, హనుమకొండ జిల్లా సిఐటియు కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేశారు. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంల సమావేశం హనుమకొండలోని పబ్లిక్‌గార్డెన్‌లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడూతూ రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ వసతి గృహాలలో ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎమ్లుగా పని చేస్తునానరని, వీరంతా ఆశ్రమ పాఠశాలలకు, వసతి గృహాలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ ఆదివాసీ విద్యార్థులకు అనునిత్యం వైద్య, ఆరోగ్య సేవలందిస్తూ కంటికిరెప్పలా కాపాడుతున్నారన్నారు.
వేతనాలు సకాలంలో చెల్లించని కారణంగా పస్తులుండంతో పాటుగా పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులలో అకారణంగా వర్కర్ల వేతనం నుండి పెనాల్టీ కట్టాల్సి వస్తందన్నారు. అనంతరం హనుమకొండ జిల్లా నూతన కమిటీ అధ్యక్షురాలుగా గుగులోతు శ్వేత, ప్రధాన కార్యదర్శి గుగులోతు కవిత, ఉపాధ్యక్షులు బోడ రాజేశ్వరి, సహాయ కార్యదర్శి, మాలోతు సునీత, కోశాధికారి టి.రాధిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షురాలుగా కే సుజాత, ప్రధాన కార్యదర్శి డి.పుష్పలత, ఉపాధ్యక్షురాలు లావణ్య, సహాయ కార్యదర్శి పి సరిత, కోశాధికారి కమలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.