కాజీపేట, జూన్ 4 : వానకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు న్యాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలని ఎరువులు, పురుగుల మందుల దుకాణాల యజమానులకు కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు. కాజీపేట పట్టణంలోని వినాయక సీడ్స్ ఏజెన్సీ, వీరభద్ర ఏజెన్సీ విత్తన విక్రయ కేంద్రాల పై బుధవారం పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఏకకాలంలో అకస్మిక దాడులు నిర్వహించారు.
విత్తన విక్రయ దుకాణాలలోని వివిధ రకాల విత్తనాలు, ఎరువులు, నిల్వ రిజిస్టర్, రికార్డులను క్షుణంగా తనిఖీ చేశారు.విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలన్నారు. ప్రతి రైతు చిరునామా, సెల్ ఫోన్ తప్పకుండా బిల్ రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో వ్యవసాయ అధికార సంతోష్, ఎస్ఐ నవీన్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.