కాజీపేట, నవంబర్ 4: బ్యాంకులు, ఏటీఎంలో డబ్బులు డిపాజిట్, తీసేటప్పుడు తెలియని (గుర్తు తెలియని) వ్యక్తుల సహాయాన్ని ప్రజలు తీసుకోవద్దని కాజీపేట్ సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటీఎం కేంద్రాలలో మోసగాళ్లు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఏటీఎంలను మారుస్తున్నారన్నారు.
ఏటీఎం కేంద్రాలలో డబ్బులను తీసే టప్పుడు, వేసేటప్పుడు ఎవరు లేకుండా చూసు కోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏటీఎంను ఇతరుల చేతికి ఇవ్వరాదని హెచ్చరించారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద అనుమానిత వ్యక్తులు ఉన్నట్లు ఏమైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు.