సమస్త మానవాళిని పాప విముక్తుల చేసి, దైవసన్నిధికి చేర్చేందుకే యేసు ప్రభువు మానవ రూపంలో జన్మించారని చెబుతారు. ఆయన జన్మించిన శుభదినమే క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ అంటే ఆనందం, సంతోషం. అందుకే నేటి పర్వదినాన్ని ఆనందోత్సాహాల నడుమ జరుపుకొనేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలోని చర్చీలను అందంగా ముస్తాబు చేయగా రంగురంగుల విద్యుద్దీపాలతో కళకళలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభం కాగా ప్రార్థనా మందిరాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి.