హనుమకొండ, జూన్ 12 : బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేదుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తిరిగి బాలకార్మికులను గుర్తించి, వారి తల్లిదండ్రులకు చీఫ్‌విప్ అవగాహన కల్పించారు. పనిలో చేర్పించడం మాని బడిలో చేర్పించాలని సూ చించారు. బలపం పట్టాల్సిన చేతులు బండెడు చాకిరితో ఛిద్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్‌ను బంగారుమయంగా మార్చే శక్తి కేవలం చిన్నారులకు మాత్రమే ఉంటుందన్నా రు. అందుకే బాలలను బడికి పంపించి, భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చా రు. ‘పిల్లలందరూ పనిలో కాదు బడిలో ఉండాలి’ అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ‘గురుకుల విద్య’ సంక్షేమ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9,47, 200 మందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. 71 శాతం మంది బాల కార్మికులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లోనే దుర్భరం జీవితం అనుభవిస్తున్నారన్నారు. 5 నుంచి 14 ఏళ్లలోపు వారిని పనిలో పెట్టుకోవడం నేరమన్నారు. 2025 నాటికి బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా అంతం చేయడానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయన్నారు. 2021ని అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి తీర్మానించిందని చీఫ్ విప్ పేర్కొన్నారు.