హనుమకొండ, జూలై 1 : ఆపదలో ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శనివారం బాలసముంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన 19 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.14.20లక్షల చెకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకే సీఎం సహాయ నిధి అందజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి లబ్ధిదారులకు అండగా నిలిచి, మళ్లీ అధికారంలోకి వచ్చేలా సహకరించాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. అభివృద్ధి చేస్తున్న వారిపై ప్రతిపక్షాలు నిందలు వేయడం సమంజసం కాదన్నారు. బీజీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప చిల్లరగా మాట్లాడొద్దని సూచించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరి పై ఉందన్నారు.
ఆపదలో ఉన్న వారు స్థానిక పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, ఇతర నాయకుల దృష్టికి తీసుకువస్తే సాయం అందజేస్తామన్నారు. ఇప్పటికే సీఎంఆర్ఎఫ్ ద్వారా చాలామందికి లబ్ధి చేకూరిందన్నారు. వారంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు చెన్నం మధు, నర్సింగరావు, విజయలక్ష్మీ సురేందర్, మానసా రాంప్రసాద్, నలబోల సతీశ్