వరంగల్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అక్టోబర్ 6న నగరానికి రానున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటనపై మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ వచ్చే నెల 6న పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.
సంబంధిత శాఖల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన వరద నష్టం నిధులతో చేపట్టనున్న పనులు, స్మార్ట్‌సిటీ, కుడా ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు మంత్రి శంకుస్థాపనలు చేస్తారని పేర్కొన్నా రు. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశం ఉంటుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. మంత్రి పర్యటనకు పక్కా బందోబస్త్తోపాటు హెలిప్యాడ్‌పై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.