చెన్నారావుపేట, జూలై 18: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత కారణంగా తిప్పలు పడుతున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామంలో యూరియా కోసం రైతులు గంటల తరబడి లైన్లో వేచి ఉన్నారు.
వర్షాకాలం మొదలై నెలరోజులు గడుస్తున్నా పంటలకు అవసరమైన యూరియా లేక తాము అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, పత్తి పంటకు అవసరమైన యూరియా అందుబాటులో లేక దూర ప్రాంతాలకు వెళ్లి మరి యూరియా తెచ్చుకోవాల్సి వస్తుందని వాపోయారు. వచ్చే కొద్దిపాటి యూరియా కోసం తమలో తాము గొడవలు పడాల్సి వస్తుందని రైతన్నలు చెప్పుకొచ్చారు. దీనంతటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మొక్కజొన్న, పత్తితో పాటు వరి నాట్లు కూడా ప్రారంభమైన కారణంగా రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.