గీసుగొండ, ఏప్రిల్ 25 : సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, ఎవరికీ భయపడేది లేదని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లేందుకు మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆర్చి గేటు వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ప్రభ ట్రాక్టర్‌ను శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి ప్రభ ట్రాక్టర్‌ను నడిసారు.
అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రజత్సోవ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని అన్నారు. దేవుడి దగ్గరకు ఎలా వెళ్తామో అలా ప్రజలు ఎండ్లబండ్లు, ప్రభలు, వాహనాలతో సభకు రాబోతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే టెక్స్టైల్ పార్కులోని కంపెనీలను ఇబ్బందుకు గురి చేస్తున్నాడని, అందులో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను రోజూ తిప్పుతున్నాడని అన్నారు. కంపెనీల్లో పైరవీలతో ఉద్యోగాలు రావని యువత గమనించాలని అన్నారు. మీకు అర్హత ఉంటే కంపెనీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆ నాడు కేసీఆర్ కృషి, తాను కష్టపడి రైతులను ఒ ప్పిం చి 1250 ఎకరాల భూములను సేకరిస్తే టెక్స్టైల్ పార్కు ఇక్కడి వచ్చిందని, యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎందుకు వస్త్ర పరిశ్రమలు పెట్టలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గద్దెబాబు, మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండల పార్టీ కార్యదర్శి చల్లా వేణుగోపాల్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, మాజీ సర్పంచులు బోడకుంట్ల ప్రకాశ్, పూండ్రు జైపాల్‌రెడ్డి, అం కతీ నాగేశ్వర్రావు, నాయకులు అంగోత్ మోతీలా ల్, వీరాటి రవీందర్‌రెడ్డి, నాగయ్య, కుమారస్వామి, లెనిన్, శ్రీనివాస్, బాలరాజు, కోటి, ధనుంజయ్, ముంత రాజయ్య, లింగారెడ్డి, గుర్రం రఘ, వీరన్న, ప్రమోద్, రాజేందర్, సంతోష్, రాజేందర్, అఖిల్, నారాయణ, రఘపతిరెడ్డి పాల్గొన్నారు.