పరకాల, ఏప్రిల్ 7: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పరకాల పట్టణంలోని మయూరి గార్డెన్స్‌లో పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లాడారు. రజతోత్సవ సభను కనీవివీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామన్నారు.
సభ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలన్నీ బోగస్ అని తేలిపోయిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు భయపడే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి 25 వేల మంది తరలిరానున్నట్లు తెలిపారు. పరకాలలో వార్డుల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్నారు.
రానున్న రోజులు బీఆర్ఎస్వేనని, పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంత కాలం ఓపికగా ఉండాలని, ఎవరికీ భయపడొద్దని, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో నాయకులు రేగూరి విజయపాల్‌రెడ్డి, బండి సారంగపాణి, నిప్పాని సత్యనారాయణ, గురిజపల్లి ప్రకాష్‌రావు, నేతాని శ్రీనివాస్‌రెడ్డి, భీముడి నాగిరెడ్డి, చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, శనిగరం నవీన్, దామెర మొగిలి, గందె వెంకటేశ్వర్లు, చందుపట్ల తిరుపతిరెడ్డి, అడప రాము, గొర్రె రాజు, జలాలుద్దీన్, నక చిరంజీవి, వేణుగోపాల్, పంచగిరి శ్రీనివాస్, దుంపేటి నాగరాజు, గంట కళావతి పాల్గొన్నారు.