వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజ యం సాధించి అధికారంలోకి వస్తుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం, జాన్‌పాక గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
- మోసపూరిత కాంగ్రెస్‌ను ప్రజలు గద్దెదించుతారు
- కేసీఆర్‌ను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు
- పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గీసుగొండ, జూన్ 7 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజ యం సాధించి అధికారంలోకి వస్తుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం, జాన్‌పాక గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. మక్కజొన్న, ధాన్యం కొనే దిక్కులేక రైతులు ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లోనే ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరని విమర్శించారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా మో సం చేయడమే కాకుండా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన రైతు బీమాను బంద్ చేసిన కాంగ్రెస్‌ను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నా రు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఒకవైపు పాలన, మరోవైపు సంక్షేమం సమానంగా జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ మాఫియా, కమీషన్ల దందా నడుస్తున్నదని విమర్శించారు. ఎస్ఐఆర్పై పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చల్లా స్పష్టంచేశారు. సమావేశంలో నాయకులు సుంకరి శివకుమార్, గోలి రాజయ్య, గద్దె బాబు, మత్తిలింగం, నాసం మల్లేశం, పిట్టల రాజు, రమేశ్, బాలయ్య, సంజీవ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

