చిన్నగూడూరు సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆమె మేరకు అర్హులందరికి నూతన పింఛన్లు మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చాగంటి రమేష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ సంపత్ కుమార్ కు వివిధ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వికలాంగులకు ఇస్తున్న 4వేల పింఛను 6వేలు ఇస్తామని, వృద్ధులు, వితంతువులు ఒంటరి, నేత, గీత తదితర పింఛన్లను 2 వేల నుంచి 4 వేలకు పెంచి ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పింఛన్లను పెంచి ఇవ్వాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి లబ్ధిదారు నికి పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేత పెన్షన్ దారుల పోరాట సమితి, ఎల్ హెచ్ పి ఎస్ తదితర సంఘాల నాయకులు శంకర్ నాయక్, తుడుం ప్రభాకర్ నారాయణ సమ్మక్క వీరస్వామి ఉప్పలయ్య వెంకన్న తదితరులు ఉన్నారు.