గిర్మాజీపేట/నర్సంపేట/కరీమాబాద్/నెక్కొండ/ఆత్మకూరు, డిసెంబర్ 9: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వరంగల్చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ 28వ డివిజన్ అధ్యక్షుడు కురిమిల్ల సంపత్‌కుమార్, మర్రి రవీందర్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు గజ్జెల ఉమేశ్, జలంధర్, వలబోజు శ్రీనాథ్, సాయిలు, కుసుమ రమేశ్, వరంగంటి రాము, హేమంత్, మాటేటి నవీన్, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. నర్సంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్రావు కేక్ కట్ చేశారు. అనంతరం సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్వతమ్మ, రజినీభారతి, సాంబయ్యగౌడ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. కరీమాబాద్ 39వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ బాసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
వరంగల్ 32వ డివిజన్లో కాంగ్రెస్ నాయకుడు నరిగె శ్రీను ఆధ్వర్యంలో, 42వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కేడల పద్మ ఆధ్వర్యంలో పండ పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో తంగెళ్ల దేవేందర్, శేర్ల కిశోర్, క్రాంతి, నరేశ్, యాకూబ్, కరీం, అవినాష్, సోమన్న పాల్గొన్నారు. అలాగే, నెక్కొండలో జరిగిన సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బక్కి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల హరీశ్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఆత్మకూరులో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు బీరం సుధాకర్‌రెడ్డి, జనగాం రాజు, ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధికా రాజు, పీఏసీఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్‌గౌడ్, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. సంగెంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి, మెట్టుపెల్లి రమేశ్, జనగాం రమేశ్, ఆగపాటి రాజు, తీగల రాజేశ్‌గౌడ్, శ్రీకర్, పులి సాంబయ్య, రాజు, బండి రాధిక, నర్సింహనాయక్, బోగి రవి, మునుకుంట్ల శ్రీనివాస్, అవినాష్నాయక్ పాల్గొన్నారు.
పండ్లు, స్వీట్ల పంపిణీ
శాయంపేటలోని అంబేదర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి నాయకులతో కలిసి కేక్ కట్ పండ్లు పంపిణీ చేశారు. పెద్దకోడెపాక సర్పంచ్ అబ్బు ప్రకాశ్‌రెడ్డి, నాయకులు చిందం రవి, దుబాసి కృష్ణమూర్తి, బాసని శంకర్, మారెపల్లి బుజ్జి, శాయంపేట గ్రామ అధ్యక్షుడు రవిపాల్, ప్రధాన కార్యదర్శులు రాజు, నిమ్మల రమేశ్, ఎండీ రఫీ, హైదర్, మామిడిపల్లి సాంబయ్య, కుమారస్వామి, కట్టయ్య, పత్తి శీను, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. దామెర మండలంలోని ఓగ్లాపూర్‌లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. రాసమల్ల కిరణ్, దామెర శంకర్, కిన్నెర కోఠి పాల్గొన్నారు. దామెరలో కేక్‌కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యశోద రాజయ్య, దురిశెట్టి భిక్షపతి, మాజీ సర్పంచ్‌లు సదిరం సునీతా పోచయ్య, మాదారపు రమేశ్, ఉపసర్పంచ్ హింగె నాగేశ్వర్రావు, మొద్దు ప్రవీణ్, పోలుసాని అనిల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. ల్యాదెళ్లలో జక్కుల కుమారస్వామి, మాదాసు జితేందర్ పండ్లు పంపిణీ చేశారు.
చెన్నారావుపేటలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్‌నాయక్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ మండల ఉపాధ్యక్షుడు నన్నబోయిన రమేశ్, సర్పంచ్‌లు సిద్దన రమేశ్, తప్పెట రమేశ్, తూటి పావని, మంద యాకయ్య, బొంత శ్రీను, మధుసూదన్‌రెడ్డి, గ్రామ అధ్యక్షులు చిట్టె రవి, లక్క రాజు, తోట రాము పాల్గొన్నారు. కాశీబుగ్గ 18వ డివిజన్ చింతల్ బ్రిడ్జి తెలంగాణ జంక్షన్లో మరుపట్ల సాయికుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. నాయకులు నల్గొండ రమేశ్, సిలువేరు శ్రీనివాస్, సందెల లాజర్, పుష్ప, మేకల పుష్ప, డేవిడ్‌రాజ్, రత్నబాయి, బుద్గి, మడిపెల్లి ఫ్రాన్సిస్ జాషువా, ప్రేమ్, గబ్బెడ సుధాకర్, కొనగల నరసింహ, జాన్ సామ్యేల్ పాల్గొన్నారు. నడికూడలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర దేవేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మలహల్రావు, తాళ్ల నవీన్, అప్పం కుమారస్వామి, వనపర్తి నవీన్, బోగం కమల, శ్రీను, యుగేంధర్, ప్రతాపరెడ్డి, రాజేశ్వరరావు, రవీందర్రావు, సదానందం పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని కోనాయమాకుల వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమగాని సౌజన్య, జిల్లా నాయకులు చాడ కొమురారెడ్డి, దూల వెంకన్న, నాగారపు స్వామి, కూసం రమేశ్, జావిద్, ఎంపీటీసీలు మనిగోపాల్, భరత్కోమల, ఎండీ రహీం పాల్గొన్నారు.