Mulugu | ఏటూరు నాగారం : పైన ఖాళీ టమాట పెట్టెలు పెట్టుకొని కింద పశువులను కట్టేసి అక్రమంగా రవాణా చేస్తున్న డీసీఎం వ్యానును శుక్రవారం ఉదయం ఏటూరు నాగారం పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతం నుంచి డీసీఎం వ్యాన్లో 17 పశువులను ఊపిరాడకుండా కట్టేసి పైన టమాటా ఖాళీ పెట్టెలను అమర్చి హైదరాబాద్కు తరలిస్తుండగా ఏటూరునాగారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పట్టుపడ్డాయి.
అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తి పశువులు బయటకు కనిపించకుండా టమాట పెట్టెలతో అమర్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వ్యాన్ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను కట్టేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రవాణాకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పి శివం ఉపాధ్యాయ వ్యాన్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేకతకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పట్టుకున్న పశువులను భూపాలపల్లి జిల్లా రాంపూర్ గోశాలకు తరలించారు. కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్, పోలీసులు పాల్గొన్నారు.