మహబూబాబాద్ రూరల్ : కక్షిదారులు తమ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి మహమ్మద్ రఫీ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్షణికావేశంలో గొడవలు, ఘర్షణలకు దిగి అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోకూడదని సూచించారు. చిన్న విషయాలకే పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులు పెట్టి ఇబ్బందులకు గురికావద్దని పేర్కొన్నారు. భార్యాభర్తల కేసులు, భూములకు సంబంధించిన విషయాలను రాజీమార్గంలో పరిష్కరించుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. దీనిని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జడ్జి స్వాతి, మురారి, కృష్ణతేజ్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.