Ganja | భీమదేవరపల్లి, అక్టోబర్ 16 : గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు. ఆయన కథనం ప్రకారం రెండు రోజుల క్రితం ముల్కనూరు గ్రామానికి చెందిన చేపూరి అజయ్, ఆదరి మహేందర్ అనే ఇద్దరు యువకులు గ్రామ శివారులో గంజాయి సేవిస్తుండగా పక్కా సమాచారంతో సంఘటన స్థలం వద్దకు వెళ్లి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుండి ఐదు గ్రాముల ఎండు గంజాయి, రెండు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.