బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతుండగా ఊరూరా నీరాజనం పలుకుతున్నారు. మహిళలు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో ర్యాలీలుగా వచ్చి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కారు గుర్తుకు ఓటువేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించి వారితో మమేకమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అద్భుతంగా మార్చుకుందామని కోరారు.