వేలేరు : వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉపాధి హామీ పథకం ఎన్నటికీ మరిచిపోలేనిది అని, రోజంతా ఎండలో పనిచేయకుండా ఉదయం 7 గంల నుండి 10 గంల వరకు పనిచేసి సాధారణ జీవనం గడుపుతున్న కూలీలకు ఉపాధి హామీ పథకం చాలా ఉపయోగకరంగా ఉందని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సద్దాం హుస్సేన్ తెలిపారు. ఎండ తీవ్రత బాగా ఉన్నందున కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దాదాపు 500 మంది ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను, అరటి పండ్లు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలేరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కారం శ్రీనివాస్ రెడ్డి, పిన్నింటి తిరుపతి రెడ్డి, జుర్రు సంపత్, మాజీ వార్డు సభ్యులు బైరి అనిల్, అక్కల శంకర్, గడ్డం వీరన్న, మండల ఎన్ఎస్యూఐ అధ్యక్షులు జెట్టి అరవింద్, గొల్లకృష్ణంపల్లి గ్రామ అధ్యక్షులు కన్నెబోయిన సంపత్, అసెంబ్లీ యూత్ ఉపాధ్యక్షులు అక్కల ప్రశాంత్, కూరపాటి శ్రీకాంత్, ఆరిఫ్, రఫీ, రియాజ్, గుండు సాంబరాజు, తదితరులు పాల్గొన్నారు.