జనగామ, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : గులాబీ సైనికులు ఉద్యమ స్ఫూర్తిని చాటి ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని జనగామ జిల్లా ఇన్చార్జి బూడిద భిక్షమయ్య గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పార్టీ ముఖ్య నాయకులతో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రాణాలను లెక్కచేయకుండా సాధించుకున్న తెలంగాణ ప్రజలను మాయమాటలతో నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతీ కార్యకర్త క్షేత్రస్థాయిలో ఎండగట్టాలన్నారు. కేసీఆర్ త్యాగాన్ని.. సాధించిన విజయాన్ని కూడా పల్లెపల్లెనా ప్రచారం చేయాలన్నారు. శుక్రవారం జనగామ ఆర్టీసీ చౌరస్తా నుంచి యశ్వంతపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు నిర్వహించే దీక్షా దివస్ ర్యాలీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలను తరలించాలని భిక్షమయ్యగౌడ్ పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, అ న్ని మండలాల ము ఖ్య నాయకులు పాల్గొన్నారు.