నమస్తే తెలంగాణ నెట్వర్క్ : అడుగడుగునా ఆంక్షలు.. బారికేడ్లతో పోలీసుల అడ్డంకులు.. ఎక్కడికక్కడ కార్యకర్తలను అదుపులోకి తీసుకొవడంతో పాటు హౌస్ అరెస్ట్‌లు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కన్నెపల్లి పర్యటన నేపథ్యంలో ఆదివారం కనిపించిన దృశ్యాలు.. జనగామ జిల్లా పెంబర్తి నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి వరకు ప్రధాన రహదారిపై భారీగా మోహరించిన పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో బారికేడ్లను అడ్డుపెట్టి కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ శ్రేణులను నిలువరించేందుకు యత్నించగా..
పెంబర్తి, కోమల్ల, పరకాల చలివాగు, కాటారం, మహదేవపూర్, కన్నెపల్లి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గులాబీ సైనికులు వెంట రాగా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పోలీసుల ఆంక్షలను ఛేదించుకొని కేటీఆర్ కన్నెపల్లికి చేరుకున్నారు. అక్కడ పంప్‌హౌస్‌తో పాటు వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను పరిశీలించారు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందకు పోతున్నా.. వాటిని కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా మళ్లించి రైతుల పొలాలకు తరలించని కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపడ్డారు.

మహదేవపూర్/పలిమెల, జూలై 5: బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామా రావు (కేటీఆర్) పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసం గం కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పార్టీ నాయకులు పేరొన్నారు. ఈ పర్యటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన జోష్ నెలకొంది. కన్నెపల్లి పర్యటన విజయవంతం కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

కన్నెపల్లిలోని కేటీఆర్ పర్యటనకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరి కొండ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కోరుట్ల, జనగామ, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, పల్లారాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, గండ్ర వెంకటరమణారెడ్డి, దాసరి మనోహర్ రెడ్డి,

అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, కోరుకంటి చందర్, దివాకర్ రావు, సుంకె రవిశంకర్, తాటికొండ రాజయ్య, సతీశ్ బాబు, రసమయి బాలకిషన్, బాల సుమన్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్, రవీందర్ రావు, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీరాకేశ్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రావు, మండల యూత్ మాజీ అధ్యక్షుడు ఎండీ అలీం ఖాన్, సీనియర్ నాయకులు అన్కారీ ప్రకాశ్, మంథని నియోజకవర్గ మాజీ అధ్యక్షురాలు కేదారి గీత, మాజీ మహిళా మండల అధ్యక్షురాలు స్వప్న, అరుణ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.