పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ లక్ష్మీరెడ్డి అన్నారు. బుధవారం జైనూర్లోని జడ్పీఎస్ఎస్ పాఠశాల ఆవరణలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, జిల్లా కలెక్టర్ కే.హరితతో కలిసి మొక్కలు నాటారు.
- రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ లక్ష్మీరెడ్డి
జైనూర్, ఆగస్టు 12 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ లక్ష్మీరెడ్డి అన్నారు. బుధవారం జైనూర్లోని జడ్పీఎస్ఎస్ పాఠశాల ఆవరణలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, జిల్లా కలెక్టర్ కే.హరితతో కలిసి మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. విద్యార్థులు మొక్కల సంరక్షణ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారాం, వీబీజీరామ్ ఏపీవో నగేశ్, వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులున్నారు.
సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి
సిర్పూర్(యూ), ఆగస్టు 12: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే గ్రామా ల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని రూరల్ డెవలప్ మెంట్ కమిషనర్ లక్ష్మీరెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం లింగాపూర్ మండలంలోని జాముల్‌ధర, చో ర్పల్లిలో వాటర్ షెడ్ ద్వారా నిర్మించిన కుంటలను పరిశీలించి చేప పిల్లలను వదిలారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 291 కుటుంబాలకు స్వయం ఉపాధి కోసం కుటుంబానికి రూ.38 వేల చొప్పున వంద శాతం సబ్సిడీపై గతంలో ఆర్థిక సహాయాన్ని అందించగా లబ్ధిదారులు ఎలా స్వయం ఉపాధి పొందుతున్నారనే అంశంపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి, వ్యాపార అంశాలపై సూచనలు చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని, అటవీ అధికారులు చేలల్లోకి వెళ్లనివ్వడం లేదని వారికి గిరిజనులు విన్నవించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

