హనుమకొండ, సెప్టెంబర్ 25 : బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాసర్ నిబద్ధత గల నాయకుడని, తెల్లారి లేస్తే ప్రజలకు అందుబాటులో ఉండే వినయ్ ఓడిపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కానీ భవిష్యత్తులో ఆయన మంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వినయ్ ఓడిపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అయినా సరే ఈ ఓటమి కూడా మనకు మంచిదేనని గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుందన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక పోయామని అన్నారు.
ఇప్పుడు మనం సంధికాలంలో ఉన్నామని, 14ఏళ్లు ఉద్యమ పార్టీకి ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా కొట్లాడి, పోట్లాడి, ఢిల్లీ పెద్దలను ఒప్పించి, మెప్పించి తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం మనకు కొత్త అన్నారు. రాష్ట్రంలో చాలామంది మన వైపే చూస్తున్నారని ఈ సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు, శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్, వరంగల్‌కు ఐటీ కంపెనీలను మనమే తెచ్చాం, అభివృద్ధి చేశామని చెప్పుకోలేకపోయామని పేర్కొన్నారు.
మనం పూర్తి చేసిన కాల్వ విషయంలో సిగ్గులేకుండా ఇప్పటి ఎమ్మెల్యే పూలాభిషేకాలు చేయించుకుంటున్నాడని అన్నారు. దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ అవతల వారి మాటలు నమ్మి యువత మనకు దూరమైతే, తప్పుడు ప్రచారాల కారణంగా మనకు దగ్గరగా ఉన్న వర్గాలు సైతం దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో బరాబర్ ఉప ఎన్నిక వస్తదని, తప్పకుండా మనమే గెలుస్తాం అన్నారు. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారన్నారు.
హైడ్రా అనే హైడ్రామా వరంగల్‌లో కూడా మొదలైతదని, పేదలైనా, పెద్దలైనా అందరికీ ఒకే విధంగా న్యాయం జరగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వరంగల్‌లో నాయకులు, భూ కబ్జాలు చేసేవాళ్లు ఉన్నందున భూ కుంభకోణాలు జరుగుతాయని.. ఎకడైనా సరే మనం పేదవాళ్లకు అండగా నిలుద్దామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను కూడా అమలు అయ్యే వరకు వాళ్లను ఎండగడుదామని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవారెడ్డి, మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఈ ప్రభుత్వంపై హామీలు నెరవేర్చ వరకు పోరాటం చేస్తామన్నారు. గతంలో ప్రతినెల కార్యకర్తల విసృ్తతస్థాయి సమావేశాన్ని నిర్వహించే వాళ్లమని ఈసారి విసృ్తత స్థాయి సమావేవం తెలంగాణలో భవన్ నిర్వహించామన్నారు. బీఆర్ఎస్ కుటుంబానికి యువనేత కేటీఆర్ స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. ఓరుగల్లు అభివృద్ధిలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర ప్రముఖమైందన్నారు.
పార్టీ కార్యక్రమాలను ఇకపై ముమ్మరం చేస్తామని తెలిపారు. ఇప్పటికే పార్టీ కార్యాలయం వేదికగా అనేక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీని, కమిటీలను పునర్నిర్మిస్తామన్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా ఉండే వారికి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ తొమ్మిది నెలల్లో జరిగిన అభివృద్ధిగా చూపిస్తున్నదని విమర్శించారు. రానున్న రోజుల్లో పార్టీని, సోషల్ మీడియాను బలోపేతం చేస్తూ ప్రజల్లో అనునిత్యం ఉంటూ ప్రజల తరఫున పోరాడుతామని వినయ్‌భాస్కర్ అన్నారు.
‘పేరులో వినయం.. వినయంతో భాసరుడు అంటే సూర్యుడు.. కేసీఆర్ తమ్ముడు.. మంచి మాస్‌లీడర్.. మా అన్న వినయ్‌భాసర్’ అంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భాసరుడు అని ఎందుకన్నానంటే.. అన్న సూర్యుడి లాంటివాడని, సూర్యుడు కూడా అప్పుడప్పుడు నల్లటి మబ్బుల మధ్యలో కొద్ది రోజులు కనిపించకుండా పోతాడు ఇప్పుడు వరంగల్ పశ్చిమలో సైతం అదే జరుగుతోంది. రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న వినయన్న మంత్రి కావడం ఖాయం. ఓరుగల్లు కేంద్రంగా ఉద్యమాన్ని నడిపిన ముఖ్య నాయకుడు దాస్యం వినయ్‌భాస్కర్’ అని కేటీఆర్ పేర్కొన్నారు.