ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నేతలు అవే హామీలను తెలంగాణలో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
- కర్ణాటకలో ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం
- సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి
- వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం
- స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
చిల్పూరు, సెప్టెంబర్ 26 : కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నేతలు అవే హామీలను తెలంగాణలో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలం కేం ద్రంలోని బుగులు వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావుతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం చిల్పూరు, చిన్నపెండ్యాలలో మాచర్లస్వామి, ఇల్లందుల హరిబాబు అధ్యక్షతన నిర్వహించిన వేర్వేరు ఆత్మీయ సమ్మేళనాల్లో జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
ఎన్నికలు సమీపించిన తరుణంలో ఆచరణయోగ్యంకాని హామీలిస్తున్న కాంగ్రెస్ నేతలను ప్రజలు నమ్మరని శ్రీహరి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని శ్రీహరి కోరారు. కొత్తగా ఏర్పడిన చిల్పూరు మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానన్నారు. బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారం తీసుకుని తనవంతు సహకారం అందిస్తానన్నారు.
బీఆర్ఎస్ పాలనలోనే స్టేషన్ఘనపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యిందని, బీడు భూములకు సాగునీరు అందిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారన్నారు. సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, ఇందుకు తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ పెండ్యాల ఉపేందర్‌రావు కడియం శ్రీహరి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, ఎంపీపీ బొమ్మిశెట్టి సరితాబాలరాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, సర్పంచ్ ఉద్దెమారి రాజ్‌కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

