పరకాల, జులై 7 : కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గురుకుల విద్యార్థులు.. ఇప్పుడు ఉరికంబా నికి వేలాడుతున్నారని స్వేరోస్ ఫౌండర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో చదివిన విద్యార్థులుగా ఉన్నతస్థాయికి ఎదగగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పాల నలో వారి కలలు కళ్లముందే కరుగుతున్నాయన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట సాంఘిక సంక్షేమ గురుకులంలో పదో తరగతి చదువు తున్న ఏకు శ్రీవాణి ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, సోమవారం స్వేరో ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి శ్రీవాణి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం పరకాలలోని స్వర్ణ గార్డెన్స్‌లో నిర్వహించిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకులాలు మృత్యుకుహరాలుగా మారాయని, 20 నెలల్లోనే 97 మంది మృతిచెందారన్నారు. కేసీఆర్ పాలనలో ఎందరో విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీలో సీట్లు పొందారని, పూర్ణ, ఆనంద్‌కుమార్ తదితరులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారన్నారు.
దగాకోరు మాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి విద్యా శాఖను తన దగ్గరే పెట్టుకున్న సీఎం గురుకుల విద్యార్థుల చేత వంట, టాయిలెట్స్ కడిగించడం వంటి పనులు చేయిస్తున్నారని విమర్శించారు. గురుకులాల్లో అనారోగ్యానికి గురైన విద్యార్థులకు కనీసం వైద్యం అందించలేని దుర్మార్గమైన పాలన కాంగ్రెస్‌ది అని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు సన్మానాలు జరగాల్సిన వేదికలపై సంతాప సభలు జరగడం దురదృష్టమన్నారు. రాష్ట్రంలో జీవించే హకు కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలు పాలు చేస్తున్నారని విమర్శించారు. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు విషయమై సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకున్న యువకుడిని కాంగ్రెస్ నాయకులు భయ భ్రాంతులకు గురిచేయడంతో ఆతడు ఆత్మహత్య చేసుకు న్నాడన్నారు. మృతుడి కుటుంబానికి అండగా బీఆర్ఎస్ నాయకులు తరలివస్తే వారిని ఎకడికకడ అరెస్టు చేసి పలు పోలీస్స్టేషన్లలో నిర్బంధించారన్నారు. గురుకులాల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి కొండా సురేఖ, వాకిటి శ్రీహరి అబద్ధాలతో తనపై విరుచుకుపడ్డారన్నారు. తాను గురుకులాల్లో గూండాలను తయారు చేశానన్నారని, అసలు గ్యాంగులను ప్రోత్సహిస్తూ గూండాగిరికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది కొండా కుటుంబమే అని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యా శాఖ ఉండడం విద్యార్థుల దురదృష్టమని, 20 నెలల్లో ఒక్క సమీక్ష నిర్వహించకపోవ డం దారుణమని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో పోస్టింగు లేక ఖాళీగా ఉన్న వర్షిణిని కార్యదర్శిగా నియమించడంతో గురుకులాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. శ్రీవాణి ఆత్మహత్య కు పాల్పడితే మంత్రులు, కలెక్టర్ పాఠశాలను సందర్శించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి విద్యార్థిని కుటుంబానికి భరో సా ఇవ్వకపోవడం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గురుకులాలకు సొంత భవనాలు కట్టించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్వేరో, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.