జనగామ, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)/మహబూబాబాద్ రూరల్/కృష్ణ కాలనీ, ఏప్రిల్ 3 : ‘ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవం అదరాలె. మహా సభకు రామదండులా కదిలిరావాలి. ప్రతి ఒక్కరూ చాలెంజ్‌గా తీసుకొని విజయవంతం చేయాలి. ప్రతి కార్యకర్త బాధ్యత మనమే తీసుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసుకోవాలి’ అని బీఆర్ఎస్ ముఖ్య నేతలు అన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు.
ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మా ర్నేని వెంకన్న, ఎండీ ఫరీద్, బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, బాలాజీనాయక్, మంగళంపల్లి కన్న, ముత్యం వెంకన్న, మహబూబ్ పాషా, గుగులోత్ రామచంద్రు, ఖాదర్‌బాబా, సంతోష్, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆలేటి సిద్ధిలింగం, వైస్ చైర్మన్ ముసిపట్ల విజయ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రేమలతారెడ్డి, నాయకులు మనోజ్ రెడ్డి, చేవెల్లి సంపత్, వై కుమార్‌గౌడ్, ఉడుగుల భాగ్యలక్ష్మి, దొనికెల రమాదేవి, తిప్పారపు బాబురావు, బొంగు అయిల్లయ్య, లోకుంట్ల సృజన్, మారపాక రవి, బీఆర్ఎస్ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్,
మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, మైనార్టీ వి భాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ కరీం, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు సిగ్గం సిద్ధు, బండారి రవి, యూత్ అధ్య క్షుడు బుర్ర రాజు, బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు మేకల రజిత, ఎడ్ల మౌనిక, ముంజంపల్లి ముర ళీధర్, పూలమ్మ, బానోత్ రజిత, జకం రవికుమార్, ఆకుదారి మమత, నాయకులు బీబీ చారి, బాలరాజు, పోలేవేని ప్రసాద్ పోలవేణి అశోక్, చుక బాలరాజు, చాట్ల రాములు, పైండ్ల తిరుపతి శ్రీకాంత్ పటేల్, బుర్ర కుమారస్వామి, ఆకుదారి మనోహర్, ప్రేమ్‌కుమార్, భాగ్య, యూత్, గండ్ర యువసేన నాయకులు, ఆయా మండలాల బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో, గ్రామాలను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది. ఆసరా పెన్షన్ల పెంపు, కల్యాణలక్ష్మితో తులం బంగారం, వడ్లకు రూ. 500 బోనస్, రైతు భరోసాను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏ గ్రామానికి వెళ్లినా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలకు పథకాలు అందడం లేదు.
– మాజీ ఎంపీ మాలోత్ కవిత
బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవానికి జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను దేశం నలుమూలల నుంచి ప్రజలు చూస్తారు. ప్రతి ఒక్కరూ చాలెంజ్‌గా తీసుకుని సభను విజయవంతం చేయాలి.
– మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్
రైతులు పంటలు ఎండిపోయి అరిగోస పడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి. ఏ ఒక్క పథకం కూడా పూర్తిగా ప్రజలకు అందలేదు. గ్రామాల్లో రైతులకు రైతు రుణమాఫీ కాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు లేక సమస్యల వలయంలో ఉన్నాయి. ప్రజలు అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారు. కేసీఆర్‌కు వరంగల్ జిల్లా మీద ఉన్న అభిమానంతో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు కలిసి సభను విజయవంతం చేయాలి.
– ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు
అతి తక్కువ కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ప్రజలకు అనేక హామీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆ పార్టీ పాలనతో విసిగిపోయారు. గత పదేళ్లు కుంటలు, చెరువులు కళకళలాడుతు ఉండగా ఇప్పుడు ఎక్కడ చూసినా చెరువులో నీళ్లు లేవు. పంట పొలాలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెబుతారు. మళ్లీ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. ఆయన అందించిన సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు.
– మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 800 కోట్ల నిధులు తెచ్చానని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటి వరకు 8 పైసలు కూడా తీసుకురాలేదు. ఏడు రిజర్వాయర్లలో ఒకటైనా కట్టించావా..? 2014 తర్వాత కూడా ఎంపీగా ఉన్నావ్ కదా.. జానకీపురం, రాజవరం, మలాపూర్‌లో ఓటీ పాయిం ట్స్ ఇప్పించింది మేం కదా. పంటలకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తూ సంబంధిత పనులకు ఆనాటి మంత్రి కేటీఆర్ 27 ఫిబ్రవ రి 2023న శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గవ్యాప్తంగా జరిగిన అభివృద్ధి మొత్తం తాను, డాక్టర్ రాజయ్య చేసిందే.
దగా చేసి పార్టీ మారినందుకు గుణపాఠం చెప్పే సమయం అతి త్వరలోనే ఉంది. కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న చర్యలతో గోదావరిలో ఎండాకాలంలోనూ పుష్కలంగా నీళ్లున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక రూ. 6 కోట్లు విడుదల చేయకపోవడంతో 34 రోజులు మెగా కంపెనీ నిర్వహణ సంస్థ సిబ్బంది సమ్మె చేశారు. తాను ఏఈ నుంచి మంత్రి వరకు సమస్యను తీసుకెళ్లిన తర్వా త సమ్మె విరమిస్తే అప్పటికే 50 శాతం పంటలు ఎండిపోయి రైతులకు రూ.600 కోట్ల పంట నష్టం జరిగింది. చివరికి మోటర్లు ఆన్ చేసినా అవి ఆగిపోయాయి. చేతకాని చేవలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఈనెల 27న ఎల్కతుర్తి వద్ద జరిగే సభకు స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి 30 వేలకుపైగా ప్రజలను తరలించాలి.
– జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి