బయ్యారం, ఏప్రిల్ 17 : బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేసి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణకు రక్ష అని అన్నారు. ఆయన కొట్లాడి సాధించిన రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని తెలిపారు. కేసీఆర్ ఉన్నంత వరకు వారి ఆటలు సాగవని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసి దేశంలో అగ్రభాగాన నిలిపిందని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో జీవించారని తెలిపారు. నే డు అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాం గ్రెస్ సర్కారు ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధనే ధ్యే యంగా పుట్టిన బీఆర్ఎస్ 25 ఏం డ్లలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో సభ జరుపుకుంటుందని, దీనికి రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మంది వస్తారని, ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి వెయ్యి మంది కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ప్రజలు సభకు ఉప్పెనగా వచ్చి తెలంగాణ రక్షణకు అహర్నిశలు పాటుపడుతు న్న కేసీఆర్కు మరింత బలం చేకూర్చాలన్నారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోత్ బిందు సారథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వేలాదిగా వచ్చి సభను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోత్ బిందు, జిల్లా నాయకులు శ్రీకాంత్నాయక్, జర్పల శ్రీను, రాజేశ్, బావుసింగ్, శోభన్ పాల్గొన్నారు.