హసన్పర్తి/కొడకండ్ల/తొర్రూరు, ఏప్రిల్ 11: కొట్లాడే చరిత్ర మనదని, రానున్న రోజులు బీఆర్ఎస్వేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం హసన్పర్తి, కొడకండ్ల, పెద్దవంగరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ అధికారం లేదని కార్యకర్తలు బెంగ పడొద్దని, అండగా ఉంటానన్నారు. ప్రతి ఒక్కరూ సైనికుడిలా తయారై లక్షలాది మందితో సభకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇది ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు.
మన పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ చేసిన పనులే మన బలంగా నిలుస్తాయని, ప్రజలు బీఆర్ఎస్ సర్కార్ కావాలనే కోరుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని, పార్టీకి 100 సీట్లు కచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. నిజమైన ఉద్యమకారులు బీఆర్ఎస్ నాయకులని, ప్రతి కార్యకర్త కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుపోవాలన్నారు. సర్పంచ్, ఎంపీటీలను గెలిపించుకునే బాధ్యతను తానే తీసుకుంటానని పేర్కొన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో నిధులు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేని విషయమై గ్రామాల్లో చర్చలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి రామ్మూర్తి, 1, 66 డివిజన్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్, నరెడ్ల శ్రీధర్, ఆత్మ మాజీ చైర్మన్ చంద్రమోహన్, గండు అశోక్, మాజీ సర్పంచ్లు, శరత్, రాణీరాజు, సాంబారెడ్డి, బీఆర్ఎస్వీ నాయకులు రాజేందర్, వివిధ గ్రామాల బీఆర్ఎస్ అధ్యక్షులు పంజాల కుమార్, రాజు, రంజిత్, జన్ను కిషన్, ఐలయ్య, సారయ్య, రంజిత్, బీఆర్ఎస్ హసన్పర్తి, కొడకండ్ల మండల అధ్యక్షులు బండి రజినీకుమార్, సిందే రామోజీ, ఏఎంసీ మాజీ చైర్మన్ పేరం రాము, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ తదితరులు పాల్గొన్నారు.