ఆగ్రహ జ్వాలలు
ఫోన్ ట్యాపింగ్ పేరిట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడంపై ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆగ్రహ జ్వా లలు ఎగిసిపడ్డాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
- కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నిరసనలు
- ఉమ్మడి జిల్లాలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు
- అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు
- కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాల దహనం
- పలు చోట్ల అడ్డగింత.. పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తోపులాట
- నాయకులు, కార్యకర్తల అరెస్ట్.. పోలీస్ స్టేషన్లకు తరలింపు
- పాల్గొన్న ఎమ్మెల్సీ పోచంపల్లి, తక్కళ్లపల్లి, ఎమ్మెల్యే పల్లా,
- మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, మాజీ ఎమ్మెల్యేలు
నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 1 : ఫోన్ ట్యాపింగ్ పేరిట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడంపై ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆగ్రహ జ్వా లలు ఎగిసిపడ్డాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీ య రహదారిపై రాస్తారోకో చేసి, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బీఆర్ఎస్, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

జనగామలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలు, బ్యాడ్జీ లు, గులాబీ జెండాలు పట్టుకొని వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కదిలివచ్చి ఆర్టీసీ చౌరస్తాను దిగ్బంధం చేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని దహనం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి గులాబీ శ్రేణు లతో కలిసి బైఠాయించి, రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్‌లో మాజీ మంత్రి సత్య వతిరాథోడ్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన ముఖ్యమంత్రి దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి దహనం చేశారు.

అదేవిధంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు వినతి పత్రం అందజేసి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. హనుమకొండలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, ఎంజీఎం సరిల్లో ప్రభుత్వ, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య జరిగిన తోపులాటలో దాస్యం గాయపడ్డారు. అనంతరం దాస్యం వినయ్ భాసర్, గులాబీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పరకాలలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డితో కలిసి అంబే ద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. నడికూడలో నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేపట్టారు. హస న్పర్తి ఎర్రగుట్టగుట్ట జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ రాస్తారోకో నిర్వహించారు. భూపాలపల్లిలో 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించి, జెనో ఎదురుగా గల జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. వరంగల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాస్తారోకో చేశారు. మరిపెడలో మాజీ మంత్రి రెడ్యానాయక్, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.



Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

