హనుమకొండ, డిసెంబర్ 1 : అరవై లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఆప్తుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని, ఆయన 20 ఏళ్ల పాటు సేవలందించినందుకు పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శ్రీనివాస్‌రెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశా రు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూ దనాచారి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరైన ఈ కార్యక్రమంలో వినయ్ భాస్కర్ మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెన్నంటి నడిచి, పార్టీకి సుదీర్ఘ కాలం సేవలందించిన మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన తొలి, మలిదశ ఉద్యమకారుడ ని, ప్రభుత్వ ఉద్యోగిగా, తెలంగాణభవన్ ఇన్చార్జిగా, ఎమ్మెల్సీగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఆయన పార్టీకి సేవలం దించడంలో తోడ్పడిన కుటుంబ సభ్యులకు వినయ్ భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఓరుగల్లు బిడ్డగా శ్రీనివాసరెడ్డి ఉద్యమ వ్యాప్తికి, బీఆర్ఎస్ పార్టీకి ఎంతగానో తోడ్పాటునందించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు మెమెంటో అందించి, శాలువాతో సతరించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన గులాబీ శ్రేణులు శ్రీనివాసరెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించాయి.