హనుమకొండ, ఏప్రిల్ 23 : రజతోత్సవ మహాసభ నిర్వహణ, జన సమీకరణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం హనుమకొండలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంట్లో వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్షించారు.
గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేసేలా నాయకులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. జనసమీకరణకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు ఉమ్మడి జిల్లాలో పర్యటించి అవసరమైన సూచనలు, సలహాలు అందజేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లిని కేటీఆర్ కోరారు.