మహబూబాబాద్ : పట్టణంలో నిర్మిస్తున్న జంక్షన్ నిర్మాణాలను ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఇబ్బందులు లేకుండా నిర్మాణాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు పేర్కొన్నారు. శనివారం ఉదయం ముత్యాలమ్మ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జంక్షన్ నిర్మాణ మ్యాపును పరిశీలించారు.
ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో అనేక ప్రాంతాల నుండి వాహనాల రాకపోకలు జరుగుతాయని వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జంక్షన్ నిర్మాణ పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు వచ్చే భారీ వాహనాల వల్ల ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటూ అధికారులు పనులను చేపట్టాలని సూచించారు. పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను కూడా పటిష్టం చేసి రోడ్లపైకి నీరు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్సీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మార్నేని వెంకన్న, కరుణాకర్ రెడ్డి, మార్నేని రఘు, గోపి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.