వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 23 : పేదల వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని హరీశ్‌రావు అన్నారు. సోమవారం వరంగల్‌లో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ హయాంలో రూ.1100 కోట్లతో సెంట్రల్ జైలు స్థలంలో తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణాన్ని పరిశీలించారు. భవనంలో కలియదిరిగి పనుల్లో పురోగతి కనిపించడం లేదన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందు కు కేసీఆర్ సర్కారు నిధులు వెచ్చించి వరంగల్‌కు తలమానికంగా ఉండేలా హెల్త్‌సిటీకి శ్రీకారం చు ట్టారని చెప్పారు.
150 పడకలతో ఎమర్జెన్సీ వైద్యసేవలు, రెండు వేల పడకల సామర్థ్యం, 33 ఆపరేషన్ థియేటర్లు, 14 అంతస్తుల్లో వైద్యం సేవలు అందించడంతో పాటు మిగితా పది అంతస్తుల్లో పరిపాలనా విభాగం, పీజీ వైద్యులకు వసతి, ల్యా బ్లు, లైబ్రరీలు, బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు వీలుగా నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.
తొలుత 16 లక్షల 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పను లు కొనసాగుతున్న క్రమంలో హాస్పిటల్‌ను సందర్శించిన కేసీఆర్ పలు సూచనలు చేసి సుమారు 20 లక్షల 50వేల చదరపు అడుగులకు పెంచేలా సూచనలు చేయగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 84శాతం పనులు పూర్తి అయ్యాయని హరీశ్‌రావు తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలన రావడం తో హాస్పిటల్ పనులు నత్తనడకన కొనసాగిస్తున్నారని సుమారు 14 నెలలు గడిచినా 16శాతం పనులు పూర్తి చేయలేకపోయారని, ఇది వారి చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. అయితే హాస్పిటల్ నిర్మాణం పూర్తయ్యితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు పేరొస్తుందన్న అక్కసుతో ఉన్న రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు.
అలాగే ఎంజీఎంలో నిత్యం విద్యుత్ అంతరాయం, యంత్రాలు పనిచేయకపోవడం, మందులు లేకపోవడం, రోగులను ఎలుకలు కరవ డం, వైద్య సేవల్లో ఇబ్బందులు..ఇలా ఘటనలు తరచూ సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా హాస్పిటల్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, బీ ఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
కార్యకర్తలను, నాయకులను తొక్కుకుంటూ వచ్చిన నాయకుడు నిలదొక్కుకోలేడని హరీశ్‌రావు అన్నారు. తరాల నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నాయకులను తొక్కుకుంటూ వచ్చిన రేవంత్‌రెడ్డి తెలంగాణ పేదల సంక్షేమాన్ని సైతం తొక్కేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన రైతుబంధు, దళితబంధు, బతుకమ్మ చీరెలు, కేసీఆర్ కిట్లు, ఉచిత చేపపిల్లల పంపిణీ లాంటి సంక్షేమ పథకాలను నిలిపివేసి ప్రజలను సైతం తొక్కేస్తున్నాడని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రశాంతంగా ఉన్న తెలంగా ణ ఇప్పుడు నిప్పుల కుంపటిగా మారిందన్నారు. అన్నింటా వెనుకబడుతున్నా నేరాల్లో మాత్రం 41శాతం వృద్ధి సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయని, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు.