హనుమకొండ, డిసెంబర్ 23 : 420 హామీలు.. 6 గ్యారెంటీలంటూ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో కోటలు కట్టడమే తప్ప ఏడాది కాలంలో చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు.. ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని ప్రజా పీడన పాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండలోని ఏకశిలా పార్కు ఎదుట 2023 సెప్టెంబర్ 13న సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
17రోజులుగా సమ్మె చేస్తున్న ఉద్యోగుల దీక్షా శిబిరం వద్ద సోమవారం హరీశ్‌రావు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇదే స్థలంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వా త చాయ తాగినంత సేపట్లో రెగ్యులర్ చేస్తానని రేవంత్‌రెడ్డి ఏడాది క్రితం ఇచ్చిన మాట నీటిమూటగానే మిగిలిపోయింది.. సీఎం రేవంత్‌రెడ్డిది నోరా.. మోరా అని ఎద్దేవా చేశారు. కనీసం పిలిచి మాట్లాడే సోయిలేదన్నారు. ఉద్యోగులు హైదరాబాద్‌లో నిరసన వ్యక్తం చేస్తే అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని, మీ సమస్యపై అసెంబ్లీ నిలదీశామని, శాసనమండలిలో పిటిషన్ కూడా ఇచ్చామన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది.. మీరు అధైర్యపడకండి అని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ పాలనలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించిన తర్వాత వివిధ కారణాలతో నియామక పత్రాలు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికే నియామక పత్రాలు అందజేసి తామే ఇచ్చామని సిగ్గూఎగ్గూలేకుండా గొప్పలు చెప్పుకుంటున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలని హామీ ఇచ్చిన కాంగ్రెస్ 12వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 6వేలు మాత్రమే భర్తీ చేసిందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలకు అసెంబ్లీని వేదికగా మార్చారని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పనిముట్లు, స్ప్రింక్లర్లు ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదని డిప్యూటీ సీఎం అన్నారని అన్న మాజీ మంత్రి మేం రైతులకు ఇవన్ని ఇవ్వకపోతే రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా భట్టి అని ప్రశ్నిస్తే సమాధానం లేదన్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని అసెంబ్లీలో అబద్ధాలు చెప్తే అసెంబ్లీలో తాను రూపాయితో సహా లెకలు అప్పజెప్పినట్లు తెలిపారు. బీఆర్ఎస్ చేసింది కేవలం 4 లక్షల 17 వేల కోట్లే అని, మీరు 7 లక్షల కోట్ల అప్పు అని అబద్ధాలు చెప్తే లీగల్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు హరీశ్‌రావు చెప్పారు.
సర్వశిక్షా అభియాన్‌లో 1,523 ఉద్యోగాలు తామే ఇచ్చామని, మీ సమస్యల పరిషారానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టి, ప్రజల ముందు వారి నిజస్వరూపాన్ని బయట పెట్టాలన్నారు. కేసీఆర్ చేసిన పనులన్నీ మీకు అర్ధమవుతుందని, అందుకే నిజం నిలకడ మీద తెలుస్తదన్నారు. ఇవాళ ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, ప్రజా ప్రభుత్వంలో 7వ గ్యారెంటీ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉందా అని ప్రశ్నించారు.
సినీ హీరో అల్లు అర్జున్ను అరెస్టు చేసినవు సరే, కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన నీ సోదరుడు తిరుపతిరెడ్డిని కూడా అరెస్టు చేయాలికదా ఎందుకు అరెస్టు చేయించడం లేదని ప్రశ్నించారు. చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? 54మంది హాస్టల్ విద్యార్థులు మరణిస్తే పట్టించుకోవడం లేదని ఇది ప్రజాపాలనా? లగచర్ల రైతులకు బేడీలు వేస్తే.. ఇది ప్రజాపాలనా? సీఎం రేవంత్‌రెడ్డీ నువ్వు మనిషివైతే, మాట మీద నిలబడితే, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిషరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.