బచ్చన్నపేట జూన్ 30 : జనగాం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని మండల బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యేని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పల్లా ఆరోగ్యం త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరమ్ మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, నాయకులు ఈదులకంటి ప్రతాప్ రెడ్డి, చల్ల శ్రీనివాస్ రెడ్డి, ఫిరోజ్, కొండి వెంకట్ రెడ్డి, బాల సిద్దులు, వెంకటేష్, బొమ్మేన ఆంజనేయులు, తిర్మల్ రెడ్డి, ఇమ్మడి జితేందర్ రెడ్డి, శ్రీపతి దయాకర్, ఎండీ. అజీమ్, సిద్ది రామ్ రెడ్డి, కోనేటి స్వామి, కరికే కరుణాకర్, లక్కీరెడ్డి చందు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో గోదావరి జలాలు..
జనగామ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు త్వరలో గోదావరి జలాలు వస్తాయని మ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన్ని కలిసిన బచ్చన్నపేట మండల నేతలతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లు చెరువులు, కుంటలు నింపామన్నారు. అధికారులతో ఎప్పటి కప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ మాట్లాడే వారని గుర్తు చేసారు. రైతులు ఆందోళన చెండాల్సిన అవసరం లేదన్నారు.కన్నె బోయిన గూడెం, తపాస్పల్లికి నీళ్లు వస్తాయన్నారు