బచ్చన్నపేట ఏప్రిల్ 29 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం అహర్నిశలు కృషి చేసిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని మంగళవారం బచ్చన్నపేట మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ లో నిర్వహించిన వేడుకలకు లక్షలాదిగా జనం తరలి వెళ్లడంతో ఎమ్మెల్యే పల్లా కృషి ఎంతో ఉందన్నారు.
కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన రాజేశ్వర్ రెడ్డి సభ బాధ్యతలు భుజాన వేసుకొని ప్రణాళిక బద్ధంగాగా జన సమీకరణ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పల్లా చేస్తున్న సేవలు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయడం లేదని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న రాజేశ్వర్రెడ్డిది పెద్ద మనసు అని కొనియాడారు. కార్యక్రమంలో పీఎస్ఎస్ చైర్మన్ పూర్ణచందర్, మండల నాయకులు బాల్రెడ్డి, కొండి వెంకటరెడ్డి, ప్రతాపరెడ్డి, అజీమ్, అనిల్ రెడ్డి, బాలచందర్, సిద్ధిరాం రెడ్డి, మల్లవరం వెంకటేశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.