జనగామ, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అర్ధరాత్రి ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి పడుకున్న వారిని లేపి మరీ వెంట తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్యను గృహ నిర్బంధంలో ఉంచగా, గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీనాయక్ను అరెస్టు చేశారు.
సభలో నిరసన తెలిపే అవకాశం ఉన్నదని అదుపులోకి తీసుకొని జనగా మ, బచ్చన్నపేట, లింగాలఘనపురం, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్స్టేషన్లకు తరలించారు. సీఎం పర్యటనను నిరసిస్తూ జనగామ చౌరస్తాలో బీజేపీ నాయకులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. ఏఐఎస్ఎఫ్ నాయకుడు, విజయ డైరీ డైరెక్టర్, ఆటో యూనియన్ నాయకులను కూడా ముందస్తుగా అరెస్టు చేశారు.
సీఎం పర్యటన నేపథ్యంలో జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేయ డం అప్రజాస్వామికమనీ, ప్రభుత్వ పిరికిపంద చర్య ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్ర జా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నదని, అసమర్థ పాలనపై ఎకడ ప్రశ్నిస్తారోనని బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటన ఉంటే జనగామ నేతలను ఎం దుకు అరెస్ట్ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో ప్రజలు, రైతుల సమస్యలు పరిషరించేందుకు కృషి చేయాలి కానీ నిర్బంధాలతో నిరంకుశత్వంగా వ్యవహరిస్తే మున్ముందు ప్రజలే బుద్ధి చెప్తారని హితవు పలికారు.
– ఖండించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్ది