గీసుగొండ : అలవి కాని వాగ్ధానాలతో అధికారం చేపట్టిన కాగ్రెస్ పార్టీ మోసాలను వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కోనాయిమాకుల గ్రామంలో మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులను అందించి, ప్రజలకు వివరించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ మండల మాజీ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, మండల పార్టీ కార్యదర్శి వేణుగోపాల్, మండల నాయకులు బోడకుంట్ల ప్రకాష్, జైపాల్ రెడ్డి, గుర్రం రఘు, ముంత రాజయ్య, మండల యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్, కోట ప్రమోద్, దనుంజయ్, సంతోష్, రాజేశ్వర్ రావు, మార్గం రాజు, రంగారావు, అల్లాఉద్దీన్, తదితరులు పాల్గొన్నారు.