గీసుగొండ అక్టోబర్ 19 : అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ల్యాదేళ్ల రాజు (లవ రాజ్) మృతి చెందిన సంఘటన గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే డివిజన్లోని గొర్రె కుంట గ్రామ బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న లాదేళ్ల రాజు (45) శుక్రవారం మధ్యాహ్నం హసనపర్తి పోలీస్ స్టేషన్కి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన అతడు రాత్రి 7 గంటలకు సమయంలో తన భార్య ప్రయాంకకి ఫోన్ చేసి రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పాడు.
రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోవడంతో భార్య ప్రియాంక ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి రాత్రి రాజు సోదరుడు శంకర్ అతని మిత్రులు గ్రామ శివారులోని చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టారు. తెల్లవారుజామున మొగిలిచర్ల గ్రామ శివారులోని స్మశాన వాటికకు ఆనుకొని చెరువు కట్ట వద్ద అనుమానస్పదంగా మృతి చెంది ఉండటానికి గుర్తించిన వారు పోలీసులకు సమాచారం అందించారు. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ పోలీస్ క్లోస్ టీం,డాగ్స్ స్కోడ్ బృందాలు ఘటన స్థలాల్లో వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నాయి .మృతుడికి భార్య ప్రియాం, కుమార్తె ఉన్నారు తన భర్త మృతి పై పలు అనుమానాలు ఉన్నాయని రోదిస్తూ తెలిపారు.
మృతుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సాయం
ఘటన స్థలాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సందర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అధైర్యపడవద్దు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి దహన సంస్కారాల కోసం రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందం, మాజీ జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు, నాయకులు రాజయ్య, పూర్ణచందర్ పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు.