యశంకర్ భూపాలపల్లి, జూలై 27 ( నమస్తే తెలంగాణ)/పరకాల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిం ది. డీజే పాటలు పెట్టుకుని పార్టీ జెండాలు చేతబట్టి గులాబీ దండు కదం తొక్కింది. కేటీఆర్ తన ప్రసంగంతో కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టుశిక్షణ పూర్తి చేసుకున్న 500 మందికి కుట్టుమిషన్లు, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 100 మందికి కేసీఆర్ కిట్లను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరు కాగా, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణు లు, మహిళలు తరలివచ్చి స్వాగతం పలి కేందుకు పోటీ పడ్డారు. కాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు తీరుపై కేటీఆర్ విమర్శలు చేస్తున్న సమయంలో మహిళలు పెద్ద ఎత్తున చప్పట్లతో సభను హోరెత్తించారు.
కేసీఆర్ కిట్ పంపిణీ సమయంలో కొందరు బాలింతలు ఉద్వేగానికి గురయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన కేటీఆర్ గడపగడపకూ వెళ్లి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని వివరించాలన్నారు. ప్రతి కార్యకర్త కేసీఆరేనని అనుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. అనంతరం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. నాగారం గ్రామంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
మొగుళ్లపల్లి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్‌కు గొల్లకుర్మలు గొర్రెపిల్ల, గొంగడిని, ముదిరాజ్‌లు చేప, వల, బుట్టను అందజేశా రు. అక్కడి నుంచి భూపాలపల్లికి చేరుకోగా అడుగడుగునా ప్రజలు, పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు స్వాగతం పలికారు. మొగుళ్లపల్లి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేశ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, రమేశ్, మాజీ జడ్పీటీసీ జోరుక సదయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్త కేసీఆర్ అనుకుని అధికార పార్టీ ఆగడాలపై పోరాటం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అంటేనే కరువు పార్టీ అని, ఆరు గ్యారెంటీలు అంటూ బురిడీ కొట్టించిన రేవంత్ ప్రభుత్వ మోసాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగట్టాలన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకు రూ. 50 వేలు బాకీ పడ్డదని, రెండు విడుతల రైతు బంధును ఎగ్గొట్టిందని, రూ. రెండు లక్షల రుణమాఫీ అసంపూర్తిగానే ఉందన్నారు. పథకాల అమలును మరిచిన రేవంత్ రెడ్డి, మంత్రులు అడ్డగోలు మాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనే బీసీలకు, బహుజనులకు సముచిత స్థానం ఇచ్చి సీట్లను కేటాయించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి సీఎం కేసీఆర్‌దని అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూ డా జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాసర్, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వరరావు, వాసుదేవరెడ్డి, మేడిపల్లి శోభన్ బాబు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, సాంబారి సమ్మారావు, నేతాని శ్రీనివాస్‌రెడ్డి, గురిజపల్లి ప్రకాశ్‌రావు, చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నల్లెల్ల లింగమూర్తి, గుండెబోయిన నాగయ్య, బండి సారంగపాణి, రేగూరి విజయపాల్‌రెడ్డి, చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి, ధూరిశెట్టి చంద్రమౌళి పాల్గొన్నారు.