ఎన్నికల ప్రచారంలో ఓ వైపు బీఆర్ఎస్ జోరు కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో పాటు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో హస్తం, కమలం పార్టీలు ఆగమవుతున్నాయి. అన్ని పార్టీలకంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్, ఇప్పటికే ప్రచారంలో ఎవరికీ అందనంత దూరంలో ఉంది. నిన్నమొన్నటిదాకా సమావేశాలు, సమ్మేళనాలతో బిజీగా ఉన్న గులాబీ అభ్యర్థులు, ఇప్పుడు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థుల సమక్షంలో చేరికలు వరదలా సాగుతుండగా, మిగతా పార్టీలు గుడ్లు తేలేస్తున్నాయి. ఇంకా డోర్నకల్ కాంగ్రెస్, ములుగు, నర్సంపేట, హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థులు ఎవరనేది తేలకపోవడంతో రెండు పార్టీల శ్రేణుల్లో అయోమయం నెలకొన్నది.
వరంగల్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వరంగల్, (నమస్తేతెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతున్నది. గ్రా మాలు, పట్టణాలు, నగరాల్లోని ప్రతివాడలో గులాబీ అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతుండగా, ఇంకా కొన్నిచోట్ల కాంగ్రెస్, బీజేపీ అ భ్యర్థులే ఖరారు కాలేదు. మరోవైపు తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధికి జై కొడుతూ కాంగ్రెస్, బీజేపీల నుంచే కాకుండా అన్ని పార్టీల నుం చి గులాబీ గూటికి వలసలు వరదలా కొనసాగుతున్నా యి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గా ల్లో ప్రచారం పూర్తిచేయడం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో అగ్రనేత హరీశ్‌రావు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొనడం తో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. దీనికితోడు ప్రచారంలో గులాబీ అభ్యర్థులకు అన్ని వర్గాల వారు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు బీఆర్ఎస్కే జై కొడుతున్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. కుల సంఘాలు సైతం బీఆర్ఎస్ అభ్యర్థుల కే మద్దతు తెలుపుతున్నాయి. నర్సంపేట, వరంగల్తూ ర్పు, పశ్చిమం, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచే కాకుండా పలు సంఘాల నేతలు, కార్యకర్తలు గులాబీ దళంలో కలుస్తున్నారు.
శుక్రవారం దుగ్గొండి మండలం గోపాలపురంలో కాంగ్రెస్ నుంచి పీఏసీసీ డైరెక్టర్ గోరంట్ల స్వప్న-భిక్షపతి, మూడో వార్డు మెంబర్ బోగం మాధవి రమేశ్, నారాయణ తండాలో వార్డు మెంబర్ బానోత్ కవిత, నల్లబెల్లి మండలం మేడపల్లిలో మాజీ ఎంపీటీసీ పాడి య భద్ర పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. గురువారం ఇదే దుగ్గొండి మండలంలో బీజే పీ దళితమోర్చా మండలాధ్యక్షుడు తిక్క సుభాష్ ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు డేగ ల శ్రీనివాస్, 14వ వార్డు కాంగ్రెస్‌లోని మైనారిటీలు, నర్సంపేట మండలం మహేశ్వరంలో కమ్యూనిస్టు నేత మోతె వీరారెడ్డి, గురిజాలలో కాంగ్రెస్ నుంచి పలువు రు నేతలు, నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెలో కాంగ్రె స్ సీనియర్ నేత భూక్య సేత్రామ్, మేడపల్లిలో కాం గ్రెస్, బీజేపీ, గోవిందాపురం, కొండాపురం, గుండ్లపహాడ్లో కాంగ్రెస్ నుంచి, చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో కాంగ్రెస్, ఎంసీపీఐ పార్టీల ముఖ్యనేతలు, హట్యతండాలో కాంగ్రెస్ కార్యకర్తలు కారెక్కా రు. చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహడ్లో కాంగ్రెస్ నేతలు, యువ ఓటర్లు, దుగ్గొండి మండలం పీజీతండా నుంచి కాంగ్రెస్‌కు చెందిన 50 కుటుంబా లు, మల్లంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఖానాపురం మండలం కొత్తూరులో కాంగ్రెస్ కార్యకర్తలు, నల్లబెల్లి మండలం రుద్రగూడెం నుంచి 20 కుటుంబాలు గూ లాబీ గూటికి వచ్చాయి. నెక్కొండ మండలం చిన్నకోర్పోలు ఉపసర్పంచి ధర్మావత్ చంద్యా, మరికొందరు, నర్సంపేట నియోజకవర్గంలో యువత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పరకాల నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నుంచి గీసుగొండ మండలం శాయంపేట ఎంపీటీసీ కాయిత భిక్షపతి ఎమ్మెల్యే చలా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సంగెం మండలం కృష్ణనగర్, నార్లవాయిలోనూ కాంగ్రె స్, బీజేపీ కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు.
వరంగల్‌తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అ భ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేతృత్వంలో కాం గ్రెస్, బీజేపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు గులాబీ దళం లో చేరుతున్నారు. శుక్రవారం కాంగ్రెస్ వరంగల్ సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్కే అలీ, 35వ డివిజన్లో పోటీ చేసిన మేరుగు అశోక్, 36వ డివిజన్లో బీజేవైఎం జి ల్లా ఉపాధ్యక్షుడు లక్క శివ, 33వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు చిలువేరు రాజేందర్ బీఆర్ఎస్లో చేరారు. కాం గ్రెస్ పార్టీ 33వ డివిజన్ అధ్యక్షుడు ముద్దెసాని శ్రీనివాస్ రాధిక ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 35వ డివిజన్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన కార్యకర్తలు పలువురు, 34వ డివిజన్లో ఎంసీపీఐ నేత గోరంట్ల శరత్‌కుమార్, పోచమ్మమైదాన్‌లో మైనారిటీ నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఖి లావరంగల్ పడమరకోటలోని శ్రీభక్త మార్కండేయ పరపతి సంఘం నన్నపునేనికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పోచమ్మమైదాన్‌లో ఫకీర్‌వాడ మహిళలు నరేందర్‌ను కలిసి పూర్తి మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గంగ పుత్ర సంఘం అధ్యక్షుడు, మత్స్య సహకార సంఘం సమాఖ్య రాష్ట్ర వైస్ చైర్మన్ దీటి శ్రీధర్ ఆధ్వర్యంలో గంగపుత్రులు నన్నపునేనిని కలిసి మద్దతు ప్రకటించారు.
టిక్కెట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ లు ఇంకా రగులుతూనే ఉన్నాయి. పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు సహకరించేది లేదని అసమ్మతి నేతలు తెగేసి చెబుతున్నారు. వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లో జంగా రాఘవరెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. కచ్చితంగా పోటీలో ఉంటానని ప్రకటిస్తున్నారు. పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి, జనగామలోనూ ఇదే పరిస్థితి నెలకొనగా, బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది.
నామినేషన్ల ప్రక్రియ మొదలైనా ఇప్పటికీ కాంగ్రెస్ డోర్నకల్ అభ్యర్థిని ప్రకటించలేదు. ములుగు, నర్సంపేట, హుస్నాబాద్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ఇక్కడ అభ్యర్థులు దొరక్క ఇతర పార్టీ ల నుంచి చేరే వారి కోసం బీజేపీ ఎదురు చూస్తున్నది. పరకాల, వరంగల్ తూర్పు, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్ నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వారికే బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. దీంతో అక్కడి పాత నేతలు కమలం అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నా రు. ఉమ్మడి జిల్లాలో బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలిచే పరిస్థితి లేదని, కనీసం పోటీ ఇచ్చే విధంగానూ లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు.