తొర్రూరు, ఫిబ్రవరి 3 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభు త్వం మరిచి ప్రజలను మో సం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 3, 4, 9, 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థులు తూర్పాటి రవి, జంపన్న, కిన్నెర కవిత, చకిలేల అలివేణి గెలుపు కోసం తొర్రూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పట్టణంలో రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక రూ పాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. ఆడిటోరియం నిర్మాణానికి నిధులు మంజురు చేస్తే నత్తనడకగా పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు మహిళల పేరు మీద రూ. 1200 అప్పు చేసి ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేస్తూ మోసం చేస్తున్నదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.16 వార్డుల్లో బీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య, మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, శ్రీరాం సుధీర్, ధరావత్ గాంధీనాయక్, ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.