జనగామ : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పును (High Court Verdict) స్వాగతిస్తూ బీఆర్ఎస్ (BRS ) మండల కన్వీనర్ చౌదరి పెళ్లి శేఖర్ ఆధ్వర్యంలో మాఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచి టపాసులు కాల్చి ( Firecrackers ) సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కుతంత్రాలు, కుట్రలు హైకోర్టు తీర్పుతో పటాపంచలమయ్యాయన్నారు,
హైకోర్టు తీర్పు కాంగ్రెస్ సర్కార్కు చెంపపెట్టు లాంటిది అన్నారు, ఘోష్ కమిటీ నివేదిక బోగస్ అని తేలింది అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్లు తెరిచి నిరాధార ఆరోపణలుతో బురద జల్లడం మానుకోవాలన్నారు, సూర్యుడిపై మట్టి పోస్తే అది వారిపైనే పడుతుందన్న విషయం తెలియక కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు.
ఇప్పటికైనా కేసీఆర్ను, మాజీ మంత్రులను తిట్టడం మానుకోవాలని లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు, కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ చౌదరపెల్లి శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి కిమిడి వెంకటేష్, మండల మాజీ అధ్యక్షుడు ఏదునూరి వీరన్న, నియోజకవర్గ నాయకుడు గండి యాదగిరి, లింగాల వెంకటేష్, బెజ్జం చంద్రయ్య, బాలే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.