వాజేడు, డిసెంబర్16: జ్వరంతో బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొప్పుల ప్రశాంత్ కుమారుడు మానస మేఘనాథ్(3)కు నాలుగురోజుల క్రితం జ్వరం, జలుబు రావడంతో స్థానిక వైద్యుడి వద్ద చికిత్స అందించారు.
అయినా జ్వరం తగ్గకపోవడంతో ఆదివారం భద్రాచలంలోని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు సిబ్బంది తెలుపడంతో స్వగ్రామానికి తీసుకొచ్చారు. కాగా, సోమవారం శరీరంలో కొంత కదలిక ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఏటూరునాగారం వైద్యశాలకు తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయంపై వాజేడు వైద్యాధికారి మధుకర్‌ను వివరణ కోరగా.. బాలుడు మృతి చెందినట్లు తెలిసిందని, వైద్యం కోసం ఇక్కడి పీహెచ్‌సీకి తీసుకురాలేదని తెలిపారు.