పర్వతగిరి, అక్టోబర్5: కాంగ్రెస్ పార్టీ హామీలను గాలికొదిలేసిందని, ఆ పార్టీ పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు గ్రామంలో ఇటీవల మృతి చెందిన పాలికోజు శంకరయ్య కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
గ్రామంలో కార్యకర్తలతో కొద్ది సేపు మాట్లాడారు. భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని కార్యకర్తలు, శ్రేణులు ధైర్యంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటల్లో సాగు నీరు సమృద్ధిగా ఉన్నాయంటే ప్రధానం కారణం కేసీఆర్ సారు ముందు చూపుతో తీసుకున్న గొప్పగొప్ప నిర్ణయాలేనన్నారు. అద్భుతమైన ప్రణాళికతో రైతాంగానికి వందల ఏళ్లు సాగు నీరందించేలా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసి నిర్మించారని చెప్పారు. రానున్న రోజుల్లో సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
నెక్ట్స్ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందరికి అందుబాటులో అండగా ఉంటామని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బోయినపల్లి యుగేంధర్రావు, మాజీ ఎంపీటీసీలు కోల మల్లయ్య, డాక్టర్ సాంబారు లింగమూర్తి, చిన్న మాధవరావు, సతీష్రావు, అశోక్, నాగరాజు, బాలరాజు, నర్సింగం, మోహన్, మాసాని వెంకట్, కుమారస్వామి, రామకృష్ణ, శ్రీనివాస్, అనిల్, రాజు, రమేశ్, వేణు పాల్గొన్నారు.