హనుమకొండ, నవంబర్ 18 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాళోజీ కళా క్షేత్రానికి 300 గజాల స్థలం కావాలని కాళోజీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, కాళోజీ మిత్ర బృందం అడిగితే తిరస్కరించారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మాజీ సీఎం కేసీఆర్ కాళోజీ కళాక్షేత్రానికి వరంగల్ నగర నడిబొడ్డున హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో స్థలం కేటాయించి అన్ని హంగులతో నిర్మాణం పూర్తిచేశారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళోజీ కళాక్షేత్రానికి స్థలం తిరస్కరించినా కేసీఆర్ హయాంలో కేటాయించారన్నారు. 300 గజాల స్థలం ఇవ్వని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కాళోజీ కళాక్షేత్రాన్ని చూసి ఏం సమాధానం చెపుతారని వినోద్‌కుమార్ ఆ ప్రకటనలో ప్రశ్నించారు.